భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బూర్గంపహాడ్ మండలం సారపాక వైపు వెళ్తున్న బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.
భద్రాచలం బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
గుర్తుతెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి ఇద్దరు మృతి చెందిన ఘటన... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జిపై చోటుచేసుకుంది. మృతులు దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి వాసులుగా గుర్తించారు.
భద్రాచలం బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. మృతులు దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లికి చెందిన ప్రవీణ్, నరేష్‌గా పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి:కొడుకులు చూస్తుండగానే తల్లి ఆత్మహత్య... కారణమేంటీ?