సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో హైదరాబాద్-మెదక్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ మండలం గాగిల్లపూర్కు చెందిన తొమ్మిది మంది కుటుంబసభ్యులు... నర్సాపూర్ అడవిలో కోతులకు అరటిపండ్లు వేసి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ను డీసీఎం ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలిస్తుండగా... సూర్యప్రకాష్, రాజేశ్వరి దంపతులు మృతి చెందారు. ఏడుగురు క్షతగాత్రులను సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కోతులకు అరటిపండ్లు వేసి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కోతులకు అరటిపండ్లు వేసి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి