ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురాంపల్లి గ్రామ సమీపంలోని మల్లేశ్వర స్వామి కొండ వద్ద గల ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో.. ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - road accident latest news update
పాల ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని మల్లేశ్వర స్వామి కొండ వద్ద ఉన్న ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి పై జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
జుంజురాంపల్లి నుంచి రాయదుర్గం వైపు పాలు తీసుకెళ్తున్న ఆటోను 2 ద్విచక్ర వాహనాలు చీకట్లో ఢీకొన్నాయి. రాయదుర్గం మండలం మల్కాపురం గ్రామానికి చెందిన శ్రీపతి (48) అక్కడికక్కడే మరణించగా, సిద్ధయ్య అనే వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాయదుర్గం ఎస్సై రాఘవేంద్రప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇవీ చూడండి:కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
TAGGED:
రోడ్డు ప్రమాదం తాజా వార్తలు