సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్‌లో పండగపూట విషాదం నెలకొంది. మేకలు కాసేందుకు వెళ్లి చెక్‌డ్యాంలో ఇద్దరు గల్లంతయ్యారు. సాజిద్, రాకేష్ శుక్రవారం మేకలు మేపేందుకు వెళ్లి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.
మేకలు మేపేందుకు వెళ్లి.. ఇద్దరు గల్లంతు - sangareddy crime news
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్‌లో విషాదం నెలకొంది. మేకలు కాసేందుకు వెళ్లి.. చెక్‌డ్యాం సాజిద్, రాకేష్ గల్లంతయ్యారు. సాజిద్ మృతదేహాన్ని లభించగా.. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
మేకలు మేపేందుకు వెళ్లి.. ఇద్దరు గల్లంతు
ఉదయం.. గ్రామ శివారులోని చెక్‌డ్యాంలో సాజిద్ మృతదేహం లభ్యం కావడం వల్ల రాకేష్ కోసం సాయంత్రం వరకు వెతికారు. చీకటి పడడం వల్ల ఆదివారం గాలింపు చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. సాజిద్ మృతదేహాన్ని జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇవీచూడండి:విషాదం: కారును ఢీకొన్న ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి