రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న కూలీలను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. హయత్‌నగర్‌లో నివాసముంటున్న పెంటల సుదర్శన్(70), అన్మగల్ భిక్షపతి(55) ఇద్దరు కలిసి కూలి పనికోసం వెళుతున్నారు. హయత్‌నగర్‌లోని వార్డ్ అండ్ డీడ్ విద్యా సంస్థల వద్ద రోడ్డు దాటుతుండగా... ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట్ వైపు వేగంగా వెళుతున్న లారీ( టీఎస్ 24 టీబీ 0153) ఢీకొట్టింది.
రోడ్డు దాటుతున్న ఇద్దరు కూలీలను పొట్టనబెట్టుకున్న లారీ - two labours died in hayatnagar accident
పొట్ట కూటి కోసం కూలీ పనులకు వెళ్తున్న ఆ కూలీలను లారీ రూపంలో వచ్చిన మృత్యువు మింగేసింది. రోడ్డు దాటుతున్న ఆ వృద్ధ కూలీలను మెరుపు వేగంతో వచ్చిన లారీ... మృత్యుశకటమై అనంతలోకాలకు చేర్చింది. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది.
two labour died in lorry accident at hayatnagar
ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్... పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది.