యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భువనగిరి మండలం రాయగిరి సమీపంలో అర్ధరాత్రి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే ఒకరు మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన కొత్తకొండ నవీన్ కుమార్‌గా గుర్తించారు. మృతదేహాన్ని జిల్లా కేంద్ర మార్చురీకి తరలించారు.
రక్తమోడుతున్న రోడ్లు... వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా రహదారులు రక్తమోడుతున్నాయి. అర్ధరాత్రి జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
మరో ఘటనలో వలిగొండ మండలం అరూర్ స్టేజి వద్ద అర్ధరాత్రి బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. మృతుడు ఆత్మకూరు మండలం కొరటికల్కి చెందిన చుంచు ప్రభాకర్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదీ చదవండి:రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి