నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. సుమారు 7 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది.
సిలిండర్ పేలిన ఘటనలో రెండు ఇళ్లు దగ్ధం - Two houses burned in cylinder explosion
గ్యాస్ సిలిండర్ పేలి రెండు ఇళ్లులు పూర్తిగా దగ్ధమైన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు రూ.7 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది.
దుగ్యాల సుజాత ఇంట్లో మొదట గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె కాలిపోగా, పక్కనే ఉన్న దుగ్యాల మల్లమ్మ ఇంటికి మంటలు అంటుకుని రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కొత్త ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుండి డబ్బులు తెచ్చుకున్నామని... అవి పూర్తిగా కాలిపోయాయని బోరున విలపించారు.
ఇంట్లో నాలుగు లక్షల రూపాయల నగదు, ఆరు తులాల బంగారం, 30 తులాల వెండి, బియ్యం, వంటసామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.