హైదరాబాద్ సుల్తాన్ బాజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. రాం కోఠిలోని నవీవన్ ఆనాథాశ్రమంలో ఉంటున్నారు. సంజన(17), అలేఖ్య(14) కనిపించడం లేదని ఇవాళ ఉదయం ఏడు గంటలకు గమనించిన కేర్ టేకర్ లక్ష్మీ... నిర్వాహకురాలు గీతా మిశ్రాకు సమాచారమిచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ తనిఖీ చేసినా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఇతర బాలికలను విచారించగా... వారు తమ సామానుతో బయలుదేరినట్టు చెప్పారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో నిర్వాహకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అనాథాశ్రమం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం - ఇద్దరు బాలికల అదృశ్యం
ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ రాం కోఠిలో చేటుచేసుకుంది. వీరు నవీవన్ అనాథాశ్రమంలో ఉంటున్నారు. నిర్వాహకురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనాథాశ్రమం నుంచి బాలికలు అదృశ్యం