పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, వలిగొండ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు భువనగిరి, ఆత్మకూరు, వలిగొండ, మోటకొండూర్, మోత్కూర్, చౌటుప్పల్ మండలాల పరిధిలో పశువులు, బర్రెలు, ఆవులు, మేకలను ఎత్తుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయని... వాటిలో 16 ముగజీవాలు దొంగిలించినట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.
పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలు అరెస్టు - యాదాద్రి నేర వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశువుల దొంగతనానికి పాల్పడుతున్న రెండు ముఠాలను మోత్కూరు, వలిగొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి లారీ, రూ.1,26,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలు అరెస్టు
నిందితులు జంగ లింగమంతులు, జనుకల ఉపేందర్, పశువుల కిరణ్‌ని మోత్కూర్ మండల పరిధిలో పాటిమాట్ల ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వలిగొండలో తనిఖీలు నిర్వహిస్తుండగా... మహమ్మద్ అహేమద్, కునగండ్ల చంద్ర మోహన్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి ఓ వాహనం, ఆవు, బర్రె, రూ. 3,40,000 స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:గాంధీ ఆసుపత్రిలో రెండో రోజుకు చేరిన జూడాల నిరవధిక సమ్మె