మెదక్ జిల్లా కౌడిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని, టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే మృతి చెందారు. కౌడిపల్లికి చెందిన శ్యామ్ రెడ్డి, హవేళిఘన్పూర్ మండలానికి చెందిన లక్ష్మణ్ యాదవ్ ఇద్దరు మిత్రులు. వీరు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.
బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్... ఇద్దరు మిత్రులు మృతి - ఇద్దరు మిత్రులు మృతి
ఇద్దరు మిత్రులు ఒకేచోట పనిచేస్తారు. ఎప్పుడు కలిసి తిరిగే వీరు... మరణంలోనూ తమ స్నేహాన్ని వీడలేదు. టిప్పర్ రూపంలో వెంటాడిన మృత్యువు ఇద్దరిని ఒకేసారి తనలో ఐక్యం చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో చోటు చేసుకుంది.
బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్... ఇద్దరు మిత్రులు మృతి
పని నిమిత్తం ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. కౌడిపల్లి మండలం నాగ్సాన్పల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే... వెనుక నుంచి వచ్చిన టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మురళీయాదవ్ మృతుల బంధువులను పరామర్శించారు.
ఇదీ చూడండి:అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి