తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విషాదం: ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు రైతుల మృతి

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మరణించాడు. మృతులు నాగర్‌కర్నూలు జిల్లా చారగొండ మండలం శాంతినగర్‌ వాసులుగా గుర్తించారు.

two farmers died in tractor fulty in irwin
విషాదం: ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు రైతుల మృతి

By

Published : May 2, 2020, 11:52 PM IST

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్ విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఎండుమిర్చి వ్యాపారం ముగించుకుని తమ స్వగ్రామానికి బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు మార్గమధ్యంలో తాము ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందారు. వీరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం శాంతినగర్‌కు చెందిన రామచంద్రయ్య, సుబ్బయ్య ఎండు మిర్చి వ్యాపారం ముగించుకొని తిరుగి వెళ్తుండగా... ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృత దేహాలను కల్పకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:దేశంలో కరోనా వైరస్​ రూపాంతరం చెందుతోందా?

ABOUT THE AUTHOR

...view details