అర్ధరాత్రి ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. కామారెడ్డి, జిల్లాకు చెందిన సుజిత్, మంచిర్యాల జిల్లాకు చెందిన విశాల్ ఇద్దరు సెయింట్ పీటర్స్ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. మైసమ్మ గూడలోని ఓ వసతి గృహంలో ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో సురారం నుంచి వసతి గృహానికి బైక్పై వెళ్తుండగా కట్టమైసమ్మ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో డివైడర్ను ఢీకొన్నారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదం.. ఘటనా స్థలంలో గంజాయి లభ్యం! - రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి
ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం డివైడర్ను ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతులు కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో మృత దేహాల వద్ద కేజీ గంజాయి లభ్యమైంది. మత్తులో వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఘటనా స్థలంలో గంజాయి లభ్యం!
సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించగా వారివద్ద ఒక కేజీ గంజాయి లభ్యమైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:రూ.4 లక్షల విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం..