వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ లారీలోనే ఇరుక్కుపోగా... మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఎదురెదురుగా వెళ్తోన్న రెండు లారీలు ఢీ... ఓ డ్రైవర్ పరిస్థితి విషమం - ఢీకొన్న రెండు లారీలు
అతివేగంతో ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్న ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ గేటు వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో.. ఓ డ్రైవర్ లారీలోనే ఇరుక్కోగా.. మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

లఖ్నాపూర్‌లో రెండు లారీలు ఢీ..
ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారమందించినా వెంటనే స్పందించలేదు. 108 వాహనం కూడా సకాలంలో రాలేదు. డ్రైవర్‌కు తీవ్ర రక్తస్రావమవ్వడం వల్ల స్థానికులే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.