మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆకుతోట బావి తాండకు చెందిన నరేశ్, పోచారం గ్రామానికి చెందిన గణేశ్.. ద్విచక్రవాహనంపై రామంతాపూర్ నుంచి ఉప్పల్‌కు వెళ్తున్నారు. ఐడీఏ ఉప్పల్‌కు రాగానే జేసీబీ వాహనాన్ని ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
జేసీబీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు యువకులు దుర్మరణం - medchal district crimenews
జేసీబీ వాహనాన్ని వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టడం వల్ల ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

జేసీబీని ఢీకొట్టిన బైక్
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు.