ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తండా సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని గమనించకుండా బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. వాహనాన్ని ఢీకొట్టారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు దుర్మరణం - వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
వికారాబాద్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు దుర్మరణం
మృతులు తాండూర్ మండలం అనంతారం గ్రామానికి చెందిన రమేశ్, గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. వారిద్దరూ బంధువులు కావడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:హయత్నగర్లో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం...!