హైదరాబాద్ అబిడ్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. అబిడ్స్‌లోని జీపీవో దగ్గర్లోని కృపా టిఫిన్ సెంటర్లో పనిచేసే మాస్టర్... తన పని ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా.. అటువైపు నుంచి వేగంగా వచ్చిన స్కూటీ... బలంగా ఢీకొనటం వల్ల మాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీ నడిపేవ్యక్తి తీవ్రంగా గాయపడగా... ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్కూటీ వాహనదారు సైతం ప్రాణాలు విడిచాడు. ఒళ్లు గగ్గుర్పొడితే ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో నిక్షప్తమయ్యాయి.
లైవ్ వీడియో: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి - accident in hyderabad
అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్దామని బండి తీసిన ఆ మాస్టర్... రోడ్డు కూడా దాటకుండానే లోకం విడిచివెళ్లిపోయాడు. మెరుపు వేగంతో స్కూటీ రావటం... రెండు వాహనాలు ఢీకొనటం... ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడటం... ప్రాణాలు కోల్పోవటం... అంతా చూస్తుండగానే జరిగిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి.
two died in bike accident at abids cctv footage
మృతుల్లో ఒకరు బీదర్‌కు చెందిన నర్సింగరావు, మరొకరు ఓల్డ్‌సిటీకి చెందిన మహ్మద్ కగల్గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, రాంగ్‌రూట్, హెల్మెట్ ధరించకపోవటమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధరించారు.
ఇదీ చూడండి: ప్రియుడి మోజులో పడి భర్త ప్రాణాలు తీసిన భార్య
Last Updated : Sep 23, 2020, 10:14 AM IST