బండల లోడు లారీ బోల్తా.. ఇద్దరు మృతి - stones lorry roll over in vikarabad district

16:31 September 21
బండల లోడు లారీ బోల్తా.. ఇద్దరు మృతి
బండల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఆ ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకా పస్లాబాద్లో జరిగింది. తాండూర్ నుంచి బండల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. లారీ కింద ఇద్దరు వ్యక్తులు ఇరుక్కుపోవడం వల్ల గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో వారిని పక్కకు తప్పించారు. తీవ్రగాయాలైన ఇద్దరిని కొడంగల్ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతులు రాళ్లపల్లి, అబ్దుల్ నర్సప్పలు కొడంగల్ మండలం రావులపల్లికి చెందిన వారుగా గుర్తించారు.
ఇదీ చూడండి :సరూర్‌నగర్ నాలాలో గల్లంతైన నవీన్ మృతి