తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జూరాల కాలువలో.. రెండు మృతదేహాలు లభ్యం - క్రైమ్​ వార్తలు

వనపర్తి జిల్లా పెబ్బేరు మండల పరిధిలోని జూరాల ప్రధాన కాలువలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్నానానికి వెళ్లిన యువకుల్లో ఒకరు తోమాలపల్లి గ్రామ సమీపంలో నీట మునగగా.. మరొకరు రంగాపూర్​ పుష్కరఘాట్ వద్ద నీట మునిగి ప్రాణాలు వదిలారు.

Two Dead bodies Found In Jurala Canal
జూరాల కాలువలో.. రెండు మృతదేహాలు లభ్యం

By

Published : Oct 4, 2020, 4:04 PM IST

వనపర్తి జిల్లా పెబ్బేరు మండల పరిధిలోని జూరాల ప్రధాన కాలువలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మండలంలోని తోమాలపల్లి గ్రామ సమీపంలోని జూరాల ప్రధాన కాలువలో శనివారం రాత్రి గల్లంతైన యువకుడు పెబ్బేరు సమీపంలో నీటిపై తేలాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. ఉత్తర ప్రదేశ్​కు చెందిన నిహాల్​ అలీ లారీ క్లీనర్​గా గుర్తించారు. స్నానం కోసం కాలువలోకి దిగి.. ఈత రాకపోవడం వల్ల.. నీట మునిగి ప్రాణాలు వదిలినట్టు పోలీసులు తెలిపారు.

అదే మండల పరిధిలోని చెలిమిల్ల గ్రామానికి చెందిన మాలిక్​ రంగాపూర్​ పుష్కర ఘాట్​ వద్ద కృష్ణానదిలోకి స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. శనివారం వెళ్లిన మాలిక్.. ఆదివారం రంగాపూర్​ పుష్కర ఘాట్​ వద్ద శవమై తేలాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇవీ చూడండి:అపోహలు వద్దు.. ఆస్తుల నమోదు మాత్రమే: మేయర్

ABOUT THE AUTHOR

...view details