కలుగొట్ల వాగులో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుపోయిన సింధూ రెడ్డి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెండు రోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం కలుగొట్ల వాగులో సింధూ కొట్టుకుపోయారు. పోలీసులు, గ్రామస్థులు వాగు, తుంగభద్ర నదిని అణువణువు గాలిస్తున్నా ఆమెకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. వాగులో ప్రొక్లెయిన్ సహాయంతో ముళ్ల కంపలు తొలగించారు. తుంగభద్ర నదిలో 4 పుట్టిల సహాయంతో గాలిస్తున్నారు.
రెండు రోజులు గడుస్తున్నా లభించని సింధూ ఆచూకీ
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం కలుగొట్ల వాగులో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుపోయిన సింధూ రెడ్డి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు, గ్రామస్థులు వాగు, తుంగభద్ర నదిని అణువణువు గాలిస్తున్నా ఆమెకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు.
రెండు రోజులు గడుస్తున్నా కనిపించని సింధూ ఆచూకీ
జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ గాలింపు చర్యలు పరిశీలించారు. గాలింపునకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. రేపు ప్రత్యేక బృందాలను రపించి తుంగభద్ర నదిలో గాలింపు చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు