రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన దుర్ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం స్టేషన్ పెండ్యాల జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కాజీపేట్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పంక్చరైంది. దీంతో వాహనం అదుపు తప్పి.. రోడ్డు పక్కన నడుచుకుంటు వెళ్తున్న ఇద్దరు చిన్నారులను ఢీకొంది.
ఈ ఘటనలో తెప్ప నాగరాజు (13), తెప్ప విశాల్ (8) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు అన్నదమ్ముల కుమారులే కావడం వల్ల వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల కొంతమేర ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది.