ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా గోవుపేటలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్లి గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మృతి చెందారు.
విషాదం.. బీచ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి - గోవుపేటలో ఇద్దరు బాలురు మృతి
బీచ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటన ఏపీలోని విశాఖ జిల్లా గోవుపేటలో జరిగింది. స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి గ్రామానికి చెందిన యశ్వంత్, అజిత్ కుమార్లు ప్రాణాలు కోల్పోయారు.

గ్రామానికి చెందిన వాసుపల్లి యశ్వంత్, దౌలపల్లి అజిత్ కుమార్లు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సముద్రానికి ఆనుకుని ఉన్న గెడ్డలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లారు. గెడ్డ సముద్రంలో కలిసే చోట యశ్వంత్, అజిత్ కుమార్లు మునిగిపోయారు. భయంతో మరో ముగ్గురు కేకలు వేయటంతో వారిని మత్స్యకారులు రక్షించారు. మరో ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీచదవండి..భారీగా నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు పట్టివేత