ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలం రావినూతన గ్రామానికి చెందిన మణికంఠ, పూర్ణశ్రీ అనే ఇద్దరు చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా రెండు వీధికుక్కులు వారిపై దాడి చేశాయి. వారిని కాపాడబోయి.. శునకాలను అడ్డుకోబోయిన మరో మహిళపైనా అవి దాడికి పాల్పడ్డాయి.
వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు చిన్నారులు - ఖమ్మంలో చిన్నారులపై కుక్కల దాడి వార్తలు
ఇంటి ముందు ఆడుకుంటుండగా రెండు వీధికుక్కలు ఇద్దరు చిన్నారులపై దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా రావినూతన గ్రామంలో జరిగింది. చిన్నారుల ముఖంపై తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు చిన్నారులు
చిన్నారులు ఇద్దరి ముఖంపైనా తీవ్రగాయాలయ్యాయి. వారిని బోనకల్ పీహెచ్లో ప్రాథమిక వైద్యం చేసి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి తమ ప్రాంతంలో ఉన్న వీధికుక్కలను తరిమికొట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండిఃపిచ్చికుక్క స్వైర విహారం.. తొమ్మిది మందికి గాయాలు