ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆదివారం కావడంతో తండ్రి తన ఇద్దరు కుమారులను తనతో పాటు ఇటుక బట్టి పనికి బైక్పై తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన దుర్గ, తాతాజీగా గుర్తించారు.
బైక్ను ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు చిన్నారులు మృతి - తుని వార్తలు
కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు తండ్రితో కలిసి కూలి పనికి వెళ్లిన ఇద్దరు చిన్నారులను మృత్యువు కంటైనర్ రూపంలో కాటేసింది. ఈ విషాద ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటుచేసుకుంది.
బైక్ను ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు చిన్నారులు మృతి