రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూర్‌లో ఇద్దరు చిన్నారులు అదృశ్యమవడం కలకలం రేపింది. శుక్రవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన శ్రీపాల్(13), ప్రేమ (11) అనే అన్నా చెల్లీ తిరిగి ఇంటికి రాలేదు.
అన్నాచెల్లి అదృశ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు - brother and sister missing in kuntlur
రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో ఇంట్లోంచి వెళ్లిన అన్నాచెల్లి అదృస్యమైన ఘటన కలకలం రేపింది. ఘటనపై తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుంట్లూరులో అన్నాచెల్లి అదృశ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పిల్లలు ఇంటికి రాకపోవడం వల్ల కంగారుపడిన చిన్నారుల తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడం వల్ల హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండిఃగత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యం.. కారణాలివేనా?