పూల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు.. - Two children dies in a pond latest news

11:45 October 25
పూల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పూల కోసం కుంటలో దిగిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో పండగ వేళ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి:మోండామార్కెట్లో రసాయనిక పేలుడు... త్రుటిలో తప్పిన ప్రమాదం