విషాదం: నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - crime news at tandoor
06:54 June 19
విషాదం: నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచినిలో విషాదం చోటుచేసుకుంది. నీటిగుంటలో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. రేచిని గ్రామానికి చెందిన మురికి తిరుమల్(14), మురికి మహేష్(8) గురువారం సాయంత్రం జేసీబీ తవ్విన గుంటలో పడిపోయారు. పడిపోయిన విషయం కుటుంబ సభ్యులు గమనించక పోవడం వల్ల రాత్రంతా వారి ఆచూకీ కోసం గ్రామమంతా గాలించారు. అర్థరాత్రి ఒంటి గంటకు నీటి గుంటలో మృతదేహాలు పైకి తేలడంతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గొర్రెల మంద ఉండడం వల్ల పిల్లలు సాయంత్రం అక్కడే ఆడుకున్నారు. ఆడుకుంటూ గుంటలో పడ్డారు. పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కలచి వేసింది.