తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా తండ్రి మరణించారు. గరగ శ్రీను అనే వ్యక్తి ఆయన కుమారుడు సుభాశ్, కుమార్తె లక్ష్మీదుర్గలు గురువారం సాయంత్రం పుష్కర కాలువలో పడి మృతి చెందారు. స్థానికులు మృతదేహాలను బయటికి తీశారు.
కాలువలో పడి ఇద్దరు బిడ్డలు సహా తండ్రి మృతి.. ఎలా జరిగిందంటే? - crime news in eastgodavari district
కాలువలో పడి ఇద్దరు బిడ్డలు సహా తండ్రి మరణించిన విషాద ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలో పడి ఇద్దరు బిడ్డలు సహా తండ్రి మృతి.. ఎలా జరిగిందంటే?
స్నానానికి దిగి మరణించారని కొందరు.. పిల్లలతో పాటు తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని మరికొందరు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు కోరుకొండ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి:బైక్ను ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు