తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చేపల కోసం చెరువుకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి - చేపల కోసం వెళ్లి అన్నదమ్ముల మృతి

మెదక్ జిల్లా నర్సాపూర్​ మండలం తుజాల్​పూర్​ చెరువులో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. మంగళవారం రాత్రి చేపల కోసం వెళ్లి గల్లంతైనట్టు ఎస్సై గంగరాజు తెలిపారు. పోస్టుమార్టం కోసం నర్సాపూర్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

two brothers fish hunting in fond and died after drop
చేపల కోసం చెరువుకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి

By

Published : Dec 16, 2020, 1:50 PM IST

చెరువులో పడి ఇద్దరు అన్నదమ్మలు మృతి చెందిన ఘటన... మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం తుజాల్​పూర్​లో చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం పాండ్యాతండాకు చెందిన హరిరామ్(32), శివకుమార్(28, దివ్యాంగుడు) మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు చేపల కోసం చెరువులోకి దిగినట్టు ఎస్సై గంగరాజు తెలిపారు. ప్రమాదవశాత్తు బుదరలో కూరుకుపోయారు. కుటుంబసభ్యులు ఆరా తీయగా... చెరువుకు వెళ్లారని చూసినవారు చెప్పారు. ఒడ్డున చూస్తే... మృతుల దుస్తులు కనిపించాయి.

వెంటనే పోలీసులు సమాచారమిచ్చారు. ఇవాళ ఉదయం చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా... ఇద్దరి మృతదేహాలు లభించాయి. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను నర్సాపూర్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు, బంధువులు, తండావాసులు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకొని రోదించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గంగరాజు తెలిపారు.

ఇదీ చూడండి:కిల్లర్ అల్లుడు.. ఆస్తి కోసం అత్తామామలను చంపేశాడు..

ABOUT THE AUTHOR

...view details