జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. జల్సా కోసం వెళ్లిన యువకులు ధరూర్-నర్సింగాపూర్ సమీపంలోని ఎస్సారెస్పీ డీ-64 కెనాల్ ఒడ్డుపై సెల్ఫీ తీసుకుంటూ.. కాలు జారీ అందులో పడిపోయారు. నిన్న రాత్రి ఇద్దరు యువకులు గల్లంతు కాగా వారి మృతదేహాలను ఈ రోజు గుర్తించారు.
విషాదం: రెండు ప్రాణాల్ని తీసిన సెల్ఫీల మోజు - జగిత్యాల జిల్లాలో సెల్ఫీ తీసుకుంటూ యువకుల మృతి
జగిత్యాల జిల్లాలో సెల్ఫీ మోజు యువకుల ప్రాణాల్ని బలిగొంది. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం: రెండు ప్రాణాల్ని తీసిన సెల్ఫీల మోజు...
జగిత్యాల రవింద్రనాథ్ ఠాగూర్‌నగర్‌కు చెందిన కిరణ్, ధరూర్‌లో నివాసముంటున్న చొప్పరి రవి అనే యువకుల మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ముగ్గురు యువకులు కెనాల్ సమీపంలో జల్సా చేసుకోగా మరో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కరోనా బాధితులకు డెంగ్యూ, మలేరియా ముప్పు