కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. రహదారికి ఇరువైపుల ధాన్యం ఆరబోయడం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఎదురెదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి - road accident in kamareddy
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడం వల్ల ఒకరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్లో చోటుచేసుకుంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కిష్టాపూర్లో ద్విచక్రవాహనాలు ఢీ
ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు బాశెట్టి (45) కిష్టాపూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించినట్లు ఎస్సై సతీశ్ వర్మ తెలిపారు.