గంభీరావుపేటలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఒగ్గు కథ కళాకారులు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల దేవయ్య, నామాపూర్ గ్రామానికి చెందిన గడ్డి ఆడవయ్యలు మరో ముగ్గురితో కలిసి ఒగ్గు కథ చెప్పి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఇద్దరు కళాకారులు మృతి - తెలంగాణ వార్తలు
గంభీరావుపేట మండల కేంద్రంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు ఒగ్గు కథ కళాకారులు మృతి చెందారు. కథ చెప్పి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ముచ్చర్ల దేవయ్య, ఆడవయ్యలు అక్కడికక్కడే మృతి చెందారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఇద్దరు కళాకారులు మృతి
గంభీరావుపేట మండలంలోని ముస్తఫానగర్ నుంచి ఇంటికి వెళ్తుండగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఒగ్గు కళాకారులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇదీ చదవండి:నడి'వీధి'లో బతుకులు... 'గుర్తింపు' కోసం వేడుకోలు!