ఉపాధి పేరిట మహిళలను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు కటకటాల్లోకి వెళ్లిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో జరిగింది. హైదరాబాద్ అమీర్పేట, ఎస్సార్ నగర్లో ఉంటున్న వెంకటరమణ, రామకృష్ణ, బుజ్జి అనే ముగ్గురు వ్యక్తులు తమకు ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ బిజినెస్, సినిమా డైరెక్టర్, నిర్మాతగా ఉన్నామని చెప్పి మహిళలకు మాయమాటలు చెప్పి వేధించారని కుషాయిగూడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
సినిమా నిర్మాతలమంటూ పరిచయం.. ఆ తర్వాత... - two arrested who frauded unemployed ladies in kushaiguda
తాము డైరెక్టర్లు, నిర్మాతలమంటూ నమ్మబలికి రోజుకు రూ. రెండు నుంచి పది వేల వరకు ఉపాధి కల్పిస్తామని మహిళలను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మరొకరు పరారీలో ఉన్నట్లు వారు వివరించారు.
ఉపాధిస్తామని మహిళలను మోసం చేసిన ఇద్దరు అరెస్ట్
విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు, యువతులకు ఉద్యోగం ఇప్పిస్తామని.. రోజూ రూ. 2 నుంచి 10 వేల వరకు సంపాదించవచ్చని నమ్మబలికారని పోలీసులు తెలిపారు. బాధితులకు నిందితులు రాత్రి వేళల్లో ఫోను చేసి.. తాము చెప్పిన చోటుకు రావాలని చెప్పి ఇబ్బందులు పెట్టారని పోలీసుల విచారణలో తేలినట్లు వెల్లడించారు. బుధవారం ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి:ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్