తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెళ్లిచేసుకోమన్నందుకు యువతిపై కత్తితో దాడి.. ఇద్దరు అరెస్ట్​ - పాతబస్తీ యువతి హత్య కేసులో ఇద్దరు అరెస్ట్​

పెళ్లిచేసుకోమని అడిగేందుకు.. ప్రియుడి ఇంటికి వచ్చిన యువతిని.. అతని సోదరుడు అత్యంత కిరాతంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హైదరాబాద్​ పాతబస్తీ రెయిన్​ బజార్​లో ఈ దారుణం జరిగింది.

murder at old city hyderabad
పెళ్లిచేసుకోమన్నందుకు యువతిపై కత్తితో దాడి..

By

Published : Oct 19, 2020, 5:28 AM IST

హైదరాబాద్​ పాతబస్తీ రెయిన్​ బజార్​లో యువతి హత్య కలకలం రేపింది. ప్రేమ వ్యవహారంలో ప్రియుడి సోదరుడు.. యువతిని దారుణంగా హత్య చేశాడు. నిందితుడు సయ్యద్ జమీల్​తో పాటు యువతి ప్రియుడు మహ్మద్ ముస్తఫాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

నారాయణఖేడ్​కి చెందిన రాధిక లా పరీక్ష రాయడానికి ఆరు నెలల క్రితం ఆసిఫ్​నగర్​లోని సోదరుని ఇంటికి వచ్చింది. యువతికి జంతులపై మక్కువ ఉండటంతో పలు జంతు ప్రదర్శనలకు వెళ్లేది. ఇందులో భాగంగా రెయిన్​బజార్​కి చెందిన సయ్యద్ మహ్మద్ ముస్తఫాతో పరిచయం ఏర్పడింది.

గత నాలుగు నెలలుగా.. ఆమెను దూరం పెట్టడం, ఫోన్లకు సరిగా స్పందించకపోవడం వల్ల రెయిన్​ బజార్​లోని ప్రియుడి ఇంటికి వెళ్లింది రాధిక. తనను పెళ్లి చేసుకోవాలంటూ సయ్యద్​ ముస్తఫాతో వాగ్వాదానికి దిగింది. ఇంతలో ముస్తఫా సోదరుడు సయ్యద్​ జమేల్​ ఇంటికి వచ్చాడు. మాట్లాడేందుకు రావాలంటూ ఇంటి లోపలికి రాధికను తీసుకెళ్లాడు. అనంతరం అక్కడే ఉన్న కత్తితో యువతి గొంతుపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రరక్తస్రావంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇవీచూడండి:పాతబస్తీలో అర్ధరాత్రి యువతి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details