తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్టు - AP news

తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న 450 మద్యం సీసాలను.. కృష్ణా జిల్లా చిల్లకల్లు పోలీసులు పట్టుకున్నారు. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల వద్ద.. రెండు బైకులపై అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఒక వాహనం స్వాధీనం చేసుకోగా.. మరో ద్విచక్ర వాహనం కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

two-arrested-for-smuggling-liquor-from-telangana to AP-in-krishna-districtlz
తెలంగాణ మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్టు...బాటిళ్లు స్వాధీనం

By

Published : Dec 13, 2020, 1:54 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల రోడ్డు సమీపంలో తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. 450 మద్యం బాటిల్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

జయంతిపురం గ్రామానికి చెందిన బాణావత్తు శ్రీను, లాహోరి కొండ ఇద్దరూ కలసి అక్రమంగా మద్యం సీసాలను ద్విచక్రవాహనంపై తీసుకెళుతుండగా పోలీసులు గుర్తించారు. వాహనాన్ని, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిల్లకల్లు ఎస్సై వి.వెంకటేశ్వరావు, టాస్క్ ఫోర్స్ ఎస్సై మురళీకృష్ణ తెలిపారు.

ఇదీ చూడండి:ఎందుకీ తొందర: నిమిషం ఆగితే ఐదుగురి ప్రాణాలు నిలిచేవి

ABOUT THE AUTHOR

...view details