తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2021, 10:22 AM IST

ETV Bharat / jagte-raho

అటవీ జంతువులను హతమార్చిన కేసులో ఇద్దరు అరెస్టు

కామారెడ్డి జిల్లాలో కృష్ణ జింకలను హతమార్చిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వారు తరచుగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని గుర్తించామన్నారు. నిందితులను పిట్లమ్​ ఫారెస్ట్​ రేంజ్​ అధికారికి అప్పగించారు.

two-arrested-for-killing-wild-animals-in-kaamareddy-district
అటవీ జంతువులను హతమార్చిన కేసులో ఇద్దరు అరెస్టు

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సిర్​ సముందర్​ హస్గుల్​ గ్రామ శివారులో కృష్ణ జింకలను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కడమంచి సాయిలు, కప్పరి పెద్ద రాములు అనే వ్యక్తులను పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తు వారిద్దరూ నేరాన్ని అంగీకరించారు.

కామారెడ్డి జిల్లా బీర్కుర్ మండలం వీరాపుర్ గ్రామానికి చెందిన కడమంచి సాయిలు, కప్పరి పెద్ద రాములు అనే వ్యక్తులు కొంత కాలంగా అటవీ జంతువులను విద్యుత్​షాక్​తో హతమారుస్తున్నారు. ఈ క్రమంలో సిర్ సముందర్ హస్గుల్ గ్రామ శివారులో రెండు కృష్ణ జింకలను హతమార్చి అమ్మకానికి తరలిస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితులను పిట్లమ్​ ఫారెస్ట్​ రేంజ్​ అధికారికి అప్పగించగా వారిపై కేసు నమోదు చేసి ద్రర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:జ్యువెలరీ షాప్​లో 1.20 కిలోల బంగారం చోరీ

ABOUT THE AUTHOR

...view details