సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీ కొన్న ఘటనలో గజ్వేల్ పట్టణానికి చెందిన గుంటూరు నర్సింలు(45)కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మండల పరిధిలోని కొల్గూర్లో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా గజ్వేల్ పిడిచెడు రహదారిపై ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతునికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తండ్రి మరణవార్త తెలియగానే ముగ్గురు కూతుళ్ల రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు.
గజ్వేల్ పరిధిలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు
ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొనగా గజ్వేల్ పట్టణానికి చెందిన నర్సింలు మృతి చెందారు. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్‌లో కాలినడకన రోడ్డు దాటుతుండగా డీసీఎం ఢీకొట్టిన ఘటలో జప్తిలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నమూశారు.
గజ్వేల్ పరిధిలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నారాయణ(80) ప్రజ్ఞాపూర్‌లో కాలినడకన రోడ్డు దాటుతుండగా డీసీఎం ఢీకొట్టింది. అతని తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ సీఐ ఆంజనేయులు తెలిపారు.
Last Updated : Dec 24, 2020, 7:44 PM IST