రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పొట్ట అతుక్కుని జన్మించిన అవిభక్త కవలలు మరణించారు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన చెవుల లాస్య మూడో కాన్పు కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. నెలలు నిండకపోవడమే కాకుండా... ఉమ్మ నీరు సైతం లేకపోవటం వల్ల గైనకాలజిస్ట్ అనూష, వైద్యులు చంద్రశేఖర్ రావు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశారు.
పొట్ట అతుక్కుని పుట్టిన అవిభక్త కవలల మృతి - twins died
పొట్టలు అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలు తర్వాతి రోజే మరణించిన దుర్ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో జరిగింది. నెలలు నిండకుండా పుట్టటం వల్లే ఇలా జరిగిందని వైద్యులు వెల్లడించారు.
twins dead in next day of birth in mustabad
పొట్ట అతుక్కొని అవిభక్త కవలలు జన్మించారని వీరిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఆ మరుసటి రోజే... సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. లక్షల్లో ఒకరికి ఇలా జన్మిస్తారని వైద్యులు పేర్కొన్నారు.