తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నయీం కేసులో పోలీసు అధికారులకు క్లీన్​చిట్​ - పోలీసు అధికారులకు క్లీన్​చిట్​ వార్తలు

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులకు క్లీన్‌చిట్‌ వచ్చింది. నయీంకు సహకరించినట్లుగా 25 మంది పోలీసులపై వచ్చిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు లభించలేదని సిట్​ పేర్కొంది. సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి రాసిన లేఖకు సమాధానంగా ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్​ ఇచ్చింది.

నయీం కేసులో పోలీసు అధికారులకు క్లీన్​చిట్​
నయీం కేసులో పోలీసు అధికారులకు క్లీన్​చిట్​

By

Published : Oct 3, 2020, 5:00 PM IST

కరుడుగట్టిన నేరస్థుడు, గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులకు క్లీన్‌చిట్‌ లభించింది. నయీంకు సహకరించినట్లు 25 మంది పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోవడం వల్ల క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్‌ పేర్కొంది.

ఈ మేరకు సుపరిపాలన వేదిక రాసిన లేఖకు సిట్‌ సమాధానం ఇచ్చింది. పోలీసుల్లో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, హెడ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు.

ఇదీ చదవండి:నయీం ఎన్​కౌంటర్​కు ఐదేళ్లు..సహకరించిన వారిపై చర్యలేవి?

ABOUT THE AUTHOR

...view details