తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో 12 బంగారు బిస్కెట్లు స్వాధీనం

హైదరాబాద్ శంషాబాద్​ ఎయిర్​ పోర్ట్​లో సుమారు 3.67 లక్షల విలువైన బంగారు బిస్కెట్లు కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్​ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా.. 71.47 గ్రాముల 12 బంగారు బిస్కెట్లను గుర్తించారు.

శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో 12 బంగారు బిస్కెట్లు స్వాధీనం
శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో 12 బంగారు బిస్కెట్లు స్వాధీనం

By

Published : Nov 5, 2020, 9:36 PM IST

స్వాధీనం చేసుకున్న 71.47 గ్రాముల బంగారు బిస్కెట్లు

హైదరాబాద్​ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్‌ అధికారులు 71.47 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్‌ అధికారులు అతని వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించారు.

ప్యాంట్​లో బంగారు బిస్కెట్లు తీసుకొచ్చిన ప్రయాణికుడు

ఆ ప్రయాణికుడి ప్యాంట్‌లో దాచుకున్న బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. నిందితుడి వద్ద 71.47 గ్రాముల 12 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్​ కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ శివకృష్ణ వెల్లడించారు. దాని విలువ రూ.3.67 లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన వివరించారు.

ఇదీ చదవండి:శంషాబాద్​ విమానాశ్రయంలో 5.7 కేజీల ఎర్రచందనం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details