టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న నాంపల్లి కోర్టు... తీర్పును రేపటికి వాయిదా వేసింది. సంస్థ నిధుల మళ్లించారన్న ఆరోపణపై అరెస్ట్ అయిన రవిప్రకాశ్‌ను పది రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. కస్టడీలో విచారణ జరపాల్సిన అవసరం లేదని గతంలోనే అన్ని విషయాలు వివరించారని రవిప్రకాశ్ తరఫు న్యాయవాది వాదించారు. హైకోర్టు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే మిగతా కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు.
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా - tv9 ceo raviprakash case updates
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.
tv9 ex ceo raviprakash