మెదక్ జిల్లాలో ఓ ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం నాగపూర్ వద్ద ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి మెదక్ వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కారణమైంది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు....ఇద్దరికి తీవ్ర గాయాలు - మెదక్ జిల్లా తాజా సమాచారం
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నాగపూర్ గేటు రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి మెదక్ వైపు వెళ్తున్న టీఎస్ఆర్‌టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Breaking News
ఏడుపాయల నుంచి పోచంరాల్ తండాకు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో గుండారానికి చెందిన ప్రవీణ్, పోచంరాల్ తండా వాసి వినోద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సులో మెదక్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.