పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డితో సంబంధాలున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాసు, రాంబాబుపై వేటు వేశారు. హత్య అనంతరం నిందితుడితో ఈ ముగ్గురు సంభాషించినట్లు తేలింది.
జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ - murder
రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసులు సస్పెన్షన్కు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డితో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై వేటు వేస్తు డీజీపీ నిర్ణయం తీసుకున్నారు.
జయరాం