సెల్‌ఫోన్ బ్యాటరీల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం - ఆదిలాబాద్ నేరవార్తలు

17:32 October 25
సెల్‌ఫోన్ బ్యాటరీల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర్ వాడా టోల్ ప్లాజా దగ్గర ఓ లారీ దగ్ధమయింది. దిల్లీ నుంచి తమిళనాడుకు సెల్‌ఫోన్ బ్యాటరీల లోడ్‌తో వెళ్తున్న లారీ.. టోల్‌ప్లాజా వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో టోల్‌ప్లాజా సిబ్బంది పరుగులు తీశారు. ఆదిలాబాద్‌లోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే లారీ సహా బ్యాటరీలన్నీ దగ్ధం అయ్యాయి. విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధారించారు.
ఇవీచూడండి:పండుగ పూట విషాదం: విద్యుదాఘాతంతో యువతి మృతి