సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఓడిపోవడం వల్ల మనస్తాపానికి గురైన ఆ పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దౌల్తాబాద్ మండల పరిధిలోని కోనాయిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
దుబ్బాకలో ఓటమిపై తెరాస కార్యకర్త ఆత్మహత్య! - సిద్దిపేట జిల్లా వార్తలు
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి ఓటమిపై ఆ పార్టీ కార్యకర్త కొత్తింటి స్వామి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కొత్తింటి స్వామి.. మంగళవారం వెలువడిన దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలను చూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హోరాహోరీ పోరులో తెరాస అభ్యర్థి సుజాత ఓటమిపై మనస్తాపానికి గురయ్యాడని పేర్కొన్నారు. పొలానికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడని.. విగత జీవిగా తిరిగొచ్చాడని వాపోయారు. బావి వద్ద ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీచూడండి:తెలంగాణ వచ్చాక ఉప ఎన్నికల్లో తొలిసారి తెరాసకు చేదు అనుభవం