ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లిలో పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేసిన గిరిజనుడు గెమ్మెలి కృష్ణారావు మృతదేహానికి పాడేరు ఆస్పత్రిలో శవ పంచనామా పూర్తి చేశారు. మృతదేహాన్ని పోలీసులు.. బంధువులకు అప్పగించారు. ఆస్పత్రి ఆవరణలో బంధువుల రోదనలు మిన్నంటాయి.
పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య - visakhapatnam district latestnews
ఏపీలోని విశాఖ జిల్లా అందాల వాకపల్లిలో మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన గిరిజనుడి మృతదేహానికి శవ పంచనామా పూర్తిచేసి పోలీసులు.. బంధువులకు అప్పగించారు.
పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
తన భర్త ఇన్‌ఫార్మర్ కాదని... సమాచారం లేకుండానే మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణారావుకి నలుగురు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి:'కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు లాభాలే.. నష్టాలు లేవు'