చలి మంట కోసం వేసుకున్న అగ్గి.. పచ్చని చెట్లను కాలి బూడిద చేసింది. వికారాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో ఆకతాయిలు మంట వేసి ఆర్పకుండా పోవడంతో... సుమారు 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని పచ్చని చెట్లు కాలి బుడిదయ్యాయి. జిల్లా కేంద్రంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం వెనుక భాగం కొండపై మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంటలు మొదలయ్యాయి. అవి క్రమంగా గుట్ట మొత్తం అల్లుకున్నాయి. మరోవైపు దేవాలయం నుంచి కేరెల్లి గ్రామం వెళ్లే రహదారిలో కొండ వాలుపై సుమారు 100 ఎకరాలకు పైగా మంటలు అల్లుకున్నాయి.
పక్షుల ఆర్తనాదాలు
అటవీ ప్రాంతంలోని చెట్లు, గడ్డి, పొదల్లో గూళ్లు కట్టుకున్న పక్షులు మంటల ధాటికి విలవిల్లాడాయి.