తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పేలిన ట్రాన్స్​ఫార్మర్​... భయాందోళనలో స్థానికులు - nagar karnool news

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం గుండూరులో విద్యుత్తు హెచ్చుతగ్గులు, లోవోల్టేజి కారణంగా జనావాసాల మధ్యలో ఉన్న విద్యుత్తు నియంత్రిక పేలిపోయింది. ఒక్కసారిగా ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ పేలిపోగా... స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది.

పేలిన ట్రాన్స్​ఫార్మర్​... భయాందోళనలో స్థానికులు
పేలిన ట్రాన్స్​ఫార్మర్​... భయాందోళనలో స్థానికులు

By

Published : Sep 29, 2020, 2:12 PM IST

విద్యుత్తు హెచ్చుతగ్గులు, లోవోల్టేజి కారణంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో విద్యుత్తు నియంత్రిక పేలిపోయింది. ఇళ్ల మధ్యలో ఉన్న నియంత్రిక ఒక్కసారిగా పేలిపోవడం వల్ల గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. మంటలు ఎగిసి పడటం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో నియంత్రికకు సమీపంలో ఎవరూ లేకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది.

ఇళ్లల్లోకి మంటలు వ్యాపించి ఉంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని గ్రామస్థులు వాపోతున్నారు. చాలా రోజులుగా గ్రామంలో కరెంట్ సరఫరాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయని, లోవోల్టేజీ కారణంగా కొన్ని ఇళ్లలోని విద్యుత్ పరికరాలు కాలిపోతున్నాయన్నారు. అధికారులకు పలుమార్లు తెలియజేసిన పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని వాపోయారు. భవిష్యత్తులో భారీ ప్రమాదాలు చోటు చేసుకోకముందే సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: మిస్సింగ్​ మిస్టరీ: అమ్మా... నాన్న... తప్పిపోయిన కొడుకు

ABOUT THE AUTHOR

...view details