భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన కుంజా భద్రం.. తన భార్య ఇద్దరు కుమార్తెలతో బుధవారం అశ్వారావుపేట మండలం ముద్దులమడలోని అత్తవారింటికి వెళ్లారు. భద్రం చిన్న కుమార్తె శిరీష (4 ) ముద్దుముద్దుగా పాటలు పాడి.. డాన్స్ చేసి కుటుంబీకులను ఆనందింపజేసింది.
ఉన్నట్టుండి ఒక్కసారిగా రోడ్డు పైకి వెళ్లింది. అప్పటికే గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్న పంచాయతీ ట్రాక్టర్ చిన్నారిని ఢీ కొట్టింది. దీంతో చిన్నారి తలకు బలమైన గాయం కావడం వల్ల ఆ పసికందు అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఈ ఘటనతో ట్రాక్టర్ డ్రైవర్ జెల్లి శ్రీను పారిపోయాడు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే తమ కుమార్తె మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.