తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పొలం దున్నతుండగా ట్రాక్టర్ పల్టీ... డ్రైవర్ మృతి! - తెలంగాణ వార్తలు

ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ ప్రమాదవశాత్తు ఓ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా ట్రాక్టర్ పల్టీ కొట్టి పొలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మృతుని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.

tractor-driver-dead-while-plowing-the-farm-at-duppalli-village-in-yadadri-bhuvanagiri
పొలం దున్నతుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టి డ్రైవర్ మృతి!

By

Published : Jan 11, 2021, 7:56 PM IST

ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు బిక్షం అనే డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన భిక్షం... ఓ కౌలు రైతు పొలం దున్నతున్న సమయంలో ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు.

మృతుడు వ్యవసాయం చేస్తూ ట్రాక్టర్ నడిపేవారు. ఆయనకి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. భిక్షం మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి:భార్యని చంపి... చాపలో చుట్టి మాయం చేద్దామనుకున్నాడు!

ABOUT THE AUTHOR

...view details