భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో రాళ్లలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో పలువురు కూలీలకు గాయాలయ్యాయి. మంగలితండా నుంచి టేకులపల్లి వైపు వస్తుండగా ఓ మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో గోలియతండాకు చెందిన నరసింహ, జయరామ్, రాముడు, భీముడు, జంపన్న గాయపడ్డారు.
టేకులపల్లిలో ట్రాక్టర్ బోల్తా... ఇద్దరి పరిస్థితి విషమం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేర వార్తలు
కూలీ పనులకు వెళ్లిన వారిపై విధి చిన్నచూపు చూసింది. రెక్కాడితే కానీ డొక్కాడని వారి బతుకులపై ఊహించని ప్రమాదం మరింత దెబ్బతీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో రాళ్లలోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
టేకులపల్లిలో ట్రాక్టర్ బోల్తా...ఇద్దరి పరిస్థితి విషమం
క్షతగాత్రులను సులానగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నరసింహ, జయరామ్ పరిస్థితి విషమంగా ఉంది. కూలీ కోసం వెళ్లినవారిపై విధి వక్రీకరించడంతో తీవ్ర గాయాలపాలు కావటంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.